ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిని పరిశీలించిన కేంద్ర బృందం - మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో జిల్లాల్లో మరిన్ని కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ను కోవిడ్ ఆస్పత్రిగా మార్చే విషయమై కేంద్ర బృందం ఈ రోజు జిల్లాలో పర్యటించింది.

central team visit aims
central team visit aims

By

Published : May 15, 2020, 11:46 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ను కోవిడ్ ఆస్పత్రిగా మార్చే విషయాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. ఈరోజు ఎయిమ్స్ వైద్యులతో సమావేశమైంది. కరోనా నివారణ చర్యలపై ఐదు అంశాలపై ప్రధానంగా చర్చించామని వైద్యాధికారులు తెలిపారు. త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మరో రెండు వారాల్లో 25 పడకల ఐసోలేషన్ వార్డు, 3 వెంటిలేటర్లు, కరోనా నిర్థరణ పరీక్షల కిట్స్ సిద్ధమవుతున్నట్లు ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ కేంద్ర బృందానికి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details