Chilli Cultivation: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని తిక్కిరెడ్డిపాలెంలో మిర్చి పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. మిర్చి పంటను పీడిస్తున్న తామర పురుగు ఉద్ధృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఎకరం పొలానికి ఇప్పటివరకు రూ. 90 వేలు పెట్టుబడి పెట్టామని.. తామర పురుగు కారణంగా ఒక్క క్వింటా పంట కూడా చేతికి రాలేదని రైతు శ్రీనివాస్ వాపోయాడు. పురుగు కట్టడికి ఉద్యాన శాఖ అధికారులు సైతం నివారణ చర్యలు సూచించలేకపోయారన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే ఆత్మహత్యలే తప్పా మరో దారి కనిపించటం లేదని వాపోయారు.
మిర్చిలో తామర పురుగు ఉద్ధృతిని పరిశీలించామని..,సమస్య తీవ్రంగానే ఉందని కేంద్ర బృంద సభ్యులు తెలిపారు. రైతులు నష్టపోతున్నట్లు గమనించామన్నారు.