రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నేడు కేంద్ర అధికారులు బృందం రాష్టంలో పర్యటించనుంది. కొవిడ్ కంట్రోల్ రూమ్‌లో వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్రబృందానికి వైద్యశాఖ కమిషనర్ భాస్కర్ వివరించనున్నారు. అనంతరం గుంటూరు, కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. గుంటూరులో ముందుగా జిల్లా అధికారులతో భేటీకానున్న కేంద్ర బృందం, కరోనా వైరస్ కేసుల విస్తృతి, నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు. అనంతరం జిల్లాలో క్షేత్రస్థాయిలోనూ కేంద్ర బృందం పర్యటించనుంది.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన - guntur latest news update
గుంటూరు, నరసరావుపేటలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున కేంద్ర అధికారుల బృందం ఇక్కడ పర్యటించనున్నారు. అనంతరం జిల్లాలో క్షేత్రస్థాయిలో కేంద్ర బృందం కరోనా కేసుల విస్తృతి, నియంత్రణ చర్యలపై సమీక్షించనున్నారు.
గుంటూరులో కేంద్ర బృందం పర్యటన
Last Updated : May 8, 2020, 11:42 AM IST