ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరి ఎయిమ్స్​లో.. త్వరలో ఎమర్జెన్సీ సేవలు: కేంద్ర మంత్రి

మంగళగిరి ఎయిమ్స్‌లో కేంద్రమంత్రి భారతి ప్రవీణ్‌ పవార్ పర్యటించారు. ఎయిమ్స్ ఆవరణలో మొక్కలు నాటిన కేంద్రమంత్రి.. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్‌పై ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

మంగళగిరి ఎయిమ్స్​లో త్వరలో ఎమర్జెన్సీ సేవలు
మంగళగిరి ఎయిమ్స్​లో త్వరలో ఎమర్జెన్సీ సేవలు

By

Published : Jun 11, 2022, 5:00 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్​లో త్వరలో ఎమర్జెన్సీ సేవలను ప్రారంభిస్తామని కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 1,700 ఓపీ నమోదవుతోందన్న భారతి.. సేవలను మరింత విస్తరించనున్నామన్నారు. 2018లో రూ.1,618 కోట్లతో ఎయిమ్స్ ప్రారంభించామని.. దక్షిణ భారతదేశంలో ఇదే మొదటిదని చెప్పారు. ఇప్పటికే యూజీ కోర్సు నిర్వహిస్తున్నామని.. పీజీ కోర్సును త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.

మంగళగిరి ఎయిమ్స్​ను సందర్శించిన మంత్రి.. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్​లో ప్రజలకు అర్థమయ్యే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని.. జనరిక్ మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్​పై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details