రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని భాజపా ఎంపీ సుజనా చౌదరి పునరుద్ఘాటించారు. రాజధాని విషయంలో కేంద్రానికి ఆ నిర్ణయం ఉందని స్పష్టం చేశారు.
పాలన వికేంద్రీకరణ పేరుతో రాజధానులను పెంచుకుంటూ పోవడం సరికాదు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5, 6లకు విరుద్ధంగా రాజధాని విభజన అంశాన్ని గవర్నర్ వద్దకు ప్రభుత్వం తీసుకెళ్లింది. న్యాయసమీక్ష లేకుండా ఈ విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోరు. రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ప్రజలు, న్యాయ స్థానాలు చూస్తూ ఊరుకోవు. రాజ్యసభ ఎంపీగా చెబుతున్నా.. కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుని సరైన నిర్ణయం తీసుకుంటుంది- సుజనా చౌదరి, భాజపా ఎంపీ
అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వివాదంపైనా సుజనా స్పందించారు.