ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజభన చట్టం ప్రకారమే రాజధానిగా అమరావతి.. సుప్రీంలో కేంద్రం అఫిడవిట్​ - ఏపీ రాజధాని అమరావతి సమస్య

sc
sc

By

Published : Feb 8, 2023, 8:37 PM IST

Updated : Feb 8, 2023, 10:00 PM IST

20:27 February 08

కొత్త రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు మంజూరు చేశాం: కేంద్రం

Central Govt affidavit: రాష్ట్ర విజభన చట్టంలోని నిబంధనల ప్రకారమే అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించారని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా చెప్పింది. రాజధానిగా అమరావతి కొనసాగించే విషయంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6ల ప్రకారం రాజధానికి సంబంధించిన విషయాలు ప్రస్తావించారని, సెక్షన్‌ 6ని అనుసరించి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శివరామకృష్ణన్‌ కమిటిని నియమించినట్లు కేంద్రం తెలిపింది. ఈ కమిటి నివేదికలో పొందు పరిచిన సూచనలు, సలహాలకు అనుగుణంగా... అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ... 2015 ఏప్రిల్‌ 23న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని కౌంటర్‌ అఫిడవిట్‌లో కేంద్ర హోం శాఖ పేర్కొంది. దీనికి అనుగుణంగా.. రాజధాని ప్రాదేశిక ప్రాంత చట్టం- ఎపిసిఆర్‌డిఎని తీసుకువచ్చినట్లు కేంద్రం తెలిపింది.

విభజన చట్టంలోని సెక్షన్ 94లో రాజధానిలో.. రాజ్‌భవన్‌, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్‌తో పాటు ముఖ్యమైన పట్టణ మౌలిక వసతుల కల్పనకు డబ్బులివ్వాల్సి ఉందని, ఆ మేరకు పట్టణాభివృద్ది మంజూరు చేసిన వెయ్యి కోట్ల రూపాయలతో కలిపి.. మొత్తం 2500 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ తరపున అండర్‌ సెక్రటరీ శ్యాముల్‌ కుమార్‌ బిట్‌ ప్రమాణపత్రం దాఖలు చేశారు. 2020లో రాష్ట్ర ప్రభుత్వం సీఆర్‌డీఏని రద్దు చేస్తూ.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలు నిర్ణయిస్తూ... 3 రాజధానుల ప్రతిపాదనతో చట్టాలు చేసిందని.. ఈ చట్టాలు చేసే ముందు తమతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపలేదు, తమకు చెప్పలేదని కేంద్ర సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయంలో ఇంతకుమించి సమాధానం చెప్పడానికి ఏమీ లేదని కౌంటర్‌ అఫిడవిట్‌లో కేంద్రం చెప్పింది. కౌంటర్‌తో పాటు.. శివరామకృష్ణన్‌ కమిటి నియామకం, కమిటీ ఇచ్చిన నివేదిక, సిఫారసులు, సెక్షన్‌ 5, 6, 94కు సంబంధించిన డాక్యుమెంట్లు, 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ సీఆర్‌డీఏ చట్టం తీసుకువస్తూ.. విడుదల చేసిన జీవో 97కు సంబంధించిన కాపీలను కేంద్రం జత చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 8, 2023, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details