Amaravati:సీఆర్డీఏ సవరణపై తమ అభ్యంతరాలు, సూచనలతో అమరావతి రైతులు సీఆర్డీఏ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. సీఆర్డీఏ సవరణతో..జగన్ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. రైతులతో.. సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాలు తుంగలో తొక్కుతోందని విమర్శించారు. 29 గ్రామాల్లో ఇతరులకు సెంటు భూమి ఇవ్వడం భావ్యం కాదని అన్నారు.
సీఆర్డీఏ చట్ట సవరణతో అమరావతి నిర్వీర్యం: రైతుల ఆవేదన - ఏపీ తాజా
Amaravati: జగన్ ప్రభుత్వం.. సీఆర్డీఏ సవరణతో అమరావతిని నిర్వీర్యం చేస్తోందని అమరావతి రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఆర్డీఏ రైతులతో చేసుకున్న ఒప్పందాలు తుంగలో తొక్కుతోందని విమర్శించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల అభిప్రాయాన్ని సీఆర్డీఏ అధికారులు.. పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమని రైతులు విచారం వ్యక్తం చేశారు.
![సీఆర్డీఏ చట్ట సవరణతో అమరావతి నిర్వీర్యం: రైతుల ఆవేదన amaravati-farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16859770-3-16859770-1667818589209.jpg)
గ్రామ సభలు నిర్వహించి.. రైతుల ఆమోదం తర్వాతనే పేదలకు సెంటు భూమి కేటాయించాలన్నారు. గ్రామసభలు నిర్వహించకుండా అధికారులు ఏకపక్షంగా సెంటు భూమిని పేదలకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారన్న రైతులు.. ఇది సీఆర్డీఏ చట్టానికి విరుద్ధమని ఆక్షేపించారు. దీనిపై రైతులు వ్యక్తిగతంగా సీఆర్డీఏ అధికారులకు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఇప్పటికే 20వేల పత్రాలు సమర్పించామన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల అభిప్రాయం సీఆర్డీఏ అధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమని రైతులు విచారం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: