TRIBUTES TO SUPERSTAR KRISHNA : చిరునవ్వుతో పలకరించే సూపర్‌స్టార్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని సినీ, రాజకీయ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు.
CM JAGAN TRIBUTES TO KRISHNA : ముఖ్యమంత్రి జగన్ బుర్రిపాలెం బుల్లోడు కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించారు. పూలమాలలతో భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతో పాటు మంత్రి గోపాలకృష్ణ, ఎంపీ భరత్.. నటశేఖరుడికి అంజలి ఘటించారు. అనంతరం కృష్ణ కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్.. ధైర్యంగా ఉండాలంటూ వారిని వెన్నుతట్టి ఓదార్చారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
BALAKRISHNA FAMILY TRIBUTES TO SUPERSTAR : నటుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఆయన సతీమణి వసుంధర, కుమార్తె బ్రహ్మిణి …సూపర్‌స్టార్ కృష్ణకు పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి.. మహేశ్ బాబుకు ధైర్యం చెప్పారు. చలనచిత్ర రంగానికి ఎనలేని సేవలందించిన నటశేఖరుడు ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.