ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయంతో వైకాపా సంబరాలు

పురపోరులో విజయభేరి మోగించిన వైకాపా... రాష్ట్రవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయింది. బాణసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుతూ విజయోత్సవాలు హోరెత్తించింది. గెలుపొందిన అభ్యర్థుల్ని ఘనంగా సత్కరించింది. ప్రతిపక్షాల ఆరోపణల్ని పట్టించుకోని ప్రజలు, వైకాపాకు పట్టం కట్టారంటూ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయంతో వైకాపా సంబరాలు
మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయంతో వైకాపా సంబరాలు

By

Published : Mar 16, 2021, 4:42 AM IST

Updated : Mar 16, 2021, 4:58 AM IST

మున్సిపల్‌ ఎన్నికల్లో ఘన విజయంతో వైకాపా సంబరాలు

మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధించడంతో.... ముఖ్యమంత్రి జగన్‌ను మంత్రులు అభినందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే రోజా.... పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

వైకాపా ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి..... మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, సీదిరి అప్పలరాజు అన్నారు. అన్ని ప్రాంతాలవారూ మూడు రాజధానులకు మద్దతు పలికారని గుర్తుచేశారు. గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించిన వైకాపా అభ్యర్థులతో... ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్‌, ముస్తఫా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణసంచా చప్పుళ్లు, విజయకేతన నినాదాలతో ర్యాలీ హోరెత్తింది.


ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిపక్షాలకు... ఓటుతోనే ప్రజలు జవాబిచ్చారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో గెలుపొందిన అభ్యర్థులను అభినందించారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా పుర ప్రజలు వైకాపాకే పట్టం కట్టారని... అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. పాలనా వికేంద్రీకరణ నిర్ణయానికి పురపాలక ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు సంపూర్ణ మద్దతిచ్చారని.... జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. ఆయన నివాసం వద్ద పార్టీ నాయకులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.

ఇవీ చదవండి

సాధారణ ఎన్నికల కంటే వైకాపాకు పెరిగిన ఓట్ల శాతం ఎంతంటే..

Last Updated : Mar 16, 2021, 4:58 AM IST

ABOUT THE AUTHOR

...view details