గుంటూరు భాజపా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం, భారత రాజ్యాంగమని కొనియాడారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. కొందరు ముఖ్యమంత్రులు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో కాంగ్రెస్ నేతలు మత ఘర్షణలు రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కొందరు ముఖ్యమంత్రుల పనితీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం' - celabrate 71th republic day in state bjp party office at guntur
ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. జెండా ఆవిష్కరించిన కన్నా.. భరతమాత చిత్ర పటానికి పూలమాలలు వేశారు.
!['కొందరు ముఖ్యమంత్రుల పనితీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం' celabrate 71th republic day in state bjp party office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5847042-813-5847042-1580020508988.jpg)
గుంటూరు భాజాపా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం
భాజపా రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం
ఇవీ చూడండి...