ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్​.. సీసీ కెమెరాలో దృశ్యాలు - నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్​

Boy Kidnap: గుంటూరు జిల్లాలో నాలుగేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓ మహిళ కిడ్నాప్​ చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Boy Kidnapped
నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్

By

Published : Sep 26, 2022, 7:14 PM IST

Kidnapped Boy CCTV Footage: గుంటూరు జిల్లా అరండల్​పేట పోలీస్​ స్టేషన్ పరిధిలో ఈనెల 23న అదృశ్యమైన నాలుగేళ్ల బాలుడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓ మహిళ బాలుడిని కిడ్నాప్​ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలను పోలీసులు సేకరించారు. రోడ్డుపై మహిళ ముందు నడుస్తుండగా.. ఆమెను అనుసరిస్తూ బాలుడు నడుస్తున్నట్లు దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మాయమాటలు చెప్పి అపరిచిత మహిళ బాలుడ్ని అపహరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాలుడి ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.

కిడ్నాప్​ దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details