ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిగుబడి అధికం... అమ్మకం అంతంత మాత్రం - గుంటూరు పత్తి రైతులు

పత్తి రైతులు అధిక దిగుబడి సాధించినా... పంట అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు భారత పత్తిసంస్థ రాష్ట్ర మేనేజర్ సాయి ఆదిత్య తెలిపారు. 12 క్వింటాళ్ల దిగుబడి అంచనాతో... రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు రైతులు ఒకేసారి 15 క్వింటాళ్లు తెచ్చినా కొనాలని మార్కెటింగ్ శాఖకు ప్రతిపాదించినట్లు తెలిపారు.

cci give clarification on cotton purchase quantity in market
దిగుబడి అధికం... అమ్మకం అంతంత మాత్రం

By

Published : Nov 25, 2020, 3:51 PM IST

పత్తి కొనుగోలు మొత్తానికి సంబంధించి నిబంధనలు సడలించనున్నట్లు భారత పత్తిసంస్థ రాష్ట్ర మేనేజర్ సాయి ఆదిత్య తెలిపారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి అంచనాతో కొనుగోలు చేయాలని నిర్దేశించనట్లు ఆయన తెలిపారు. అయితే తెలంగాణాలో ఇది 15 క్వింటాళ్లుగా ఉందని... అక్కడి కంటే మన నేలలు ఇంకా సారవంతమైనవి కాబట్టి ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎక్కువ దిగుబడి వచ్చిన రైతు... పంట అమ్మేందుకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒకేసారి 15 క్వింటాళ్లు తెచ్చినా కొనాలని మార్కెటింగ్ శాఖకు ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే అమలు చేస్తామన్నారు. 12 క్వింటాళ్ల నిబంధన కారణంగా కొందరు రైతులు ఎక్కువ దిగుబడి సాధించి పంట అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి రావటంతో వెసులుబాటుకు చర్యలు చేపట్టామన్నారు.

ABOUT THE AUTHOR

...view details