ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా జాలర్లకు సోదరులందరికీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. తెదేపా హయాంలో మత్స్యరంగంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలిపామన్నారు. మత్స్యకారుల గృహనిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండు చేశారు. మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని చంద్రబాబు డిమాండ్‌చేశారు.
మత్స్యరంగ అభివృద్ధితోపాటు వారిలో పేదరిక నిర్మూలనకు సైతం ఎంతో కృషి చేసామన్నారు. 50ఏళ్ళకే పింఛన్లు ఇచ్చి వారిలో భరోసా పెంచామని చంద్రబాబు గుర్తుచేశారు. వేట నిషేధ కాలంలో పరిహారం 2 రెట్లు చేశామని, మహిళా మత్స్య గ్రూపులకు సహాయం 4 రెట్లు చేసామన్నారు. వేటకెళ్లి తిరిగిరాని మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం 2 రెట్లు చేసామన్నారు. అందుకే ఎల్లప్పుడూ మత్స్యకారులే తెదేపాకి వెన్నెముకగా నిలిచారని తెలిపారు. మత్స్యరంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపి, రాష్ట్రాభివృద్ధిలో తమ వంతు పాత్రను విజయవంతంగా పోషిస్తున్నారని లోకేశ్ కొనియాడారు.
మత్స్యరంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపిన ఘనత మాదే - chandrababu wishes on fisherman
నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం. ఈ సందర్భంగా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మత్సకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
![మత్స్యరంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపిన ఘనత మాదే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5132230-686-5132230-1574323436823.jpg)
మత్స్యకారులకు చంద్రబాబు శుభాకాంక్షలు
మత్స్యకారులకు చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు