అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సౌకర్యాల లేమి, సిబ్బంది కొరతతో ఉన్నామని, పనిభారం పెరిగిందని సీబీఐ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేయదగిన కేసు కాదని న్యాయవాది అభిప్రాయం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.
అబ్దుల్ సలాం కేసు: 'సీబీఐకి పనిభారం ఎక్కువైంది..' - cbi on abdhul salam case investigation
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేయదగిన కేసు కాదని సీబీఐ తరఫు న్యాయవాది అభిప్రాయపడ్డారు. సౌకర్యాల లేమి, సిబ్బంది కొరతతో ఉన్నామని కోర్టుకు తెలిపారు.
cbi on investigation of abdul slam case in high court
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన అబ్దుల్ సలాం కుటుంబం సీఐ వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పార్టీ ప్రతినిధి ఖాజావలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి: పుర పోరు: బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులపై ఎస్ఈసీ స్పష్టత