ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు సీసీఎస్‌ పోలీసులపై సీబీఐ కేసు - గుంటూరు సీసీఎస్‌ పోలీసులపై సీబీఐ కేసు వార్తలు

క్రికెట్‌ బెట్టింగు ముఠాలతో సంబంధం ఉందంటూ అంగీకరించాలని బెదిరించి.. ముగ్గురు వ్యక్తులను 10 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారనే అభియోగంపై గుంటూరు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు పెట్టింది.

cbi case
cbi case

By

Published : Aug 12, 2020, 9:41 AM IST

ముగ్గురు వ్యక్తులను పది రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారనే అభియోగంపై గుంటూరు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసులపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది.గుంటూరు సీసీఎస్‌ పోలీసుస్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.వెంకటరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ సాంబశివరావు, కానిస్టేబుల్‌ వీరాంజనేయులుతో పాటు ఆ స్టేషన్‌కు సంబంధించిన ఇతర గుర్తుతెలియని అధికారులను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చింది. ఐపీసీ 120 బీ, 344, 348 సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపింది. గుంటూరుజిల్లాకు చెందిన నలబోలు ఆదినారాయణ, రాయిడి శ్రీనివాసరావు, తూమటి శ్రీనివాసరావులను 2019 అక్టోబరులో గుంటూరు సీసీఎస్‌ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. విచారణ చేపట్టిన అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు. దిల్లీ విభాగం ఎస్పీ ఎం.ఎస్‌.ఖాన్‌ కేసు ఎఫ్‌ఐఆర్‌ జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details