Cat Show at Petex Expo: కుక్కలను ఇళ్లలో పెంచుకోవటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల కాలంలో పిల్లుల పెంపకం కూడా ఎక్కువైంది. పెట్ పేరెంటింగ్‌లో భాగంగా చాలా మంది ఈ మధ్య కాలంలో పిల్లులను కూడా పెంచుకుంటున్నారు. అలాంటి పెంపుడు పిల్లులకు హైటెక్స్‌లో నిర్వహించిన పెటెక్స్‌లో అందాల పోటీలు నిర్వహించారు. పిల్లుల అందాల పోటీలను చూసేందుకు నగర నలుమూలల నుంచి ప్రజలు తరలి వచ్చారు. మొదటి రోజు 500 రకాలకు పైగా శునకాలతో డాగ్ షో జరిగింది.
రెండో రోజు 120 రకాల పిల్లులను ప్రదర్శనకు ఉంచి, అందాల పోటీలు నిర్వహించారు. దేశంలో కేవలం రెండు మాత్రమే ఉన్న టోయిగర్ జాతికి చెందిన పిల్లులు ప్రదర్శనలో అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ టోయిగర్ జాతి పిల్లులు అతి తక్కువ జనాభా ఉంటే.. అందులో రెండు పిల్లులు భారత దేశంలోనే ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాతి పిల్లులు రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు ఖరీదు చేస్తున్నట్లు తెలిపారు. చూడటానికి సున్నితంగా కనిపించినప్పటికీ పిల్లుల్లో టోయిగర్ జాతి పిల్లులు ఎగ్రసివ్ బ్రీడ్ అని నిర్వాహకులు చెబుతున్నారు.