గుంటూరు జిల్లా గోరంట్లలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన సుమారు రూ.30 లక్షల నగదు అపహరణకు గురైంది. ఏటీఎం సెంటర్ దగ్గరకు వచ్చిన వాహనంలో ఉన్న నగదు అపహరణకు గురైంది. ఈ ఘటనకు సంబంధించి వ్యాన్ డ్రైవర్, గన్ మెన్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బందిని పోలీసులు విచారణ చేస్తున్నారు. నగదు అపహరణకు గురైన సమయంలో గన్ మెన్ బహిర్భూమికి వెళ్లినట్లు చెబుతుండగా... అతని గన్ కూడా ఘటనా స్థలంలో లేనట్లు పోలీసులు గుర్తించారు.
ఏటీఏం వ్యానులో రూ.30 లక్షలు మాయం! - గుంటూరు జిల్లా తాజా క్రైమ్ న్యూస్
గుంటూరు జిల్లా గోరంట్లలో నగదు తరలించే వాహనంలో నుంచి సుమారు రూ.30 లక్షలు మాయం కావటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి వ్యాన్ డ్రైవర్, గన్ మెన్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గుంటూరు అర్బన్ ఏఎస్పీ మనోహర్ రావు ఘటనా స్థలానికి చేరుకుని క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు.
ఏటీఏం వ్యానులో రూ.30 లక్షలు మాయం
సమాచారం అందుకున్న గుంటూరు అర్బన్ ఏఎస్పీ మనోహర్ రావు ఘటనాస్థలానికి చేరుకుని క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఈ వాహనం ద్వారా వివిధ బ్యాంకు శాఖలకు నగదును సరఫరా చేస్తున్నారు. అయితే ఎంత మొత్తంలో నగదు పోయిందనేది స్పష్టత లేదు. సుమారుగా రూ.25 నుంచి రూ.38 లక్షల వరకు నగదు అపహరణకు గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి:గ్యాంగ్వార్ని తలపించే ఘటన... అప్రమత్తమైన పోలీసులు
Last Updated : Jun 10, 2020, 12:00 PM IST