ఆర్ధిక సంఘం నిధులను పంచాయతీలకు జమచేయాలని కోరుతూ తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన సర్పంచ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు నిధుల విడుదల కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో 32మందిపై తాడేపల్లి పోలీసులు సీఆర్పీసీ -151 కింద కేసు నమోదు చేశారు. హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు నమోదు చేసిందని సర్పంచుల సంఘం అధ్యక్షుడు చిలకపూడి పాపారావు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గేదిలేదని తేల్చి చెప్పారు.
పంచాయతీల నిధులు జమచేయాలని ధర్నా చేసిన సర్పంచులపై కేసులు నమోదు - ఏపీ పంచాయతీలు
ఈనెల 7న తాడేపల్లిలో ఆర్ధిక సంఘం నిధులను పంచాయతీలకు జమచేయాలని కోరుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన సర్పంచ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాపారావుతో పాటు మొత్తం 32 మందిపై కేసు నమోదైంది.
sarpanch