తెదేపా ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తోందని ప్రభుత్ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రజల్లో ధైర్యం నింపేందుకు కరోనా జ్వరం లాంటిదని సీఎం జగన్ మాట్లాడితే దానిని విమర్శిస్తున్నారని తప్పుబట్టారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పరీక్షలు ఎక్కువ చేసినందువల్లే కేసుల సంఖ్య పెరిగిందని అన్నారు. అలాగే రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 11 లక్షల క్వింటాళ్ల పత్తి, 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేశామని వెల్లడించారు. అలాగే రైతులకు ఇబ్బందిలేకుండా అరటిని ప్రభుత్వమే కొనుగోలు చేసిందని అన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ సమర్థంగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. తమకు రాజకీయం చేయడం మాకు ముఖ్యం కాదని... ప్రజలకు భరోసా కల్పించడమే తమ లక్ష్యమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
'ఎక్కువ పరీక్షల చేసినందువల్లే కేసులు పెరిగాయి'
కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో కరోనా పరీక్షలు ఎక్కువగా చేసినందువల్లే కేసుల సంఖ్య పెరిగిందని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు.
srikanth reddy