గుంటూరు జిల్లా కొల్లిపర మండలం హనుమాన్ పాలెంలో ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. లారీల కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామస్థులు ఆందోళన చేశారు. ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్న లారీలను అడ్డుకున్నారంటూ వారిపై కేసు నమోదు చేశారు. వారు కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు.
ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థులపై కేసు నమోదు - గుంటూరు తాజా వార్తలు
గుంటూరు జిల్లా హనుమాన్ పాలెంలో కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.
cases against on villagers