ఓ బాలికను అపహరించారనే ఫిర్యాదుపై ముగ్గురు వ్యక్తులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా కారంచేడు ఎస్సై అహ్మద్‌జానీ తెలిపిన వివరాల ప్రకారం.. కారంచేడు మండలంలోని ఓ గ్రామంలో 16 ఏళ్ల అమ్మాయి అదృశ్యమైంది. ఈ నెల 3న బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
GIRL MISSING: బాలిక అదృశ్యం..ఆ ముగ్గురి పనేనా..? - గుంటూరు నేర వార్తలు
బాలిక మిస్సింగ్‌కు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదైన ఘటన ఆలస్యంగా తెలిసింది. ఈ నెల 3న బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
![GIRL MISSING: బాలిక అదృశ్యం..ఆ ముగ్గురి పనేనా..? Case registered against three persons in Girl missing affair karamchedu mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13003042-893-13003042-1631088150522.jpg)
Case registered against three persons in Girl missing affair karamchedu mandal
ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి ఇంటికి వచ్చిన కుమార్తెను తల్లిదండ్రులు ప్రశ్నించగా.. గ్రామానికి చెందిన కాకి సూర్యం తీసుకెళ్లాడని చెప్పినట్లు పేర్కొన్నారు. గోపతోటి సువర్ణరాజు, సర్పంచి గేరా రవీంద్రనాధ్‌ఠాగూర్ తన కుమార్తెను సూర్యంను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు వివరించారు. ముగ్గురు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. విచారణ చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
ఇదీ చదవండి:SNAKE BITE: మద్యం దుకాణంలో తనిఖీలు..అధికారిణికి పాము కాటు