నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డిపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నరసరావుపేట న్యాయస్థానం నుంచి ఓ దావా విషయంలో కమిషనర్ రామచంద్రారెడ్డికి సమన్లు అందజేసేందుకు.. కోర్టు ప్రాసెసింగ్ సర్వర్ అబ్దుల్ కల్లమ్ శనివారం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అయితే.. కమిషనర్ సంతకం పెట్టకపోగా.. తనని దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించాడని అబ్దుల్ కల్లమ్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. కమిషనర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు కోర్టు నుంచి మెమో జారీ అయిందని, అందుకే కమిషనర్ రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశామని సీఐ అశోక్ కుమార్ తెలిపారు.
నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్‌పై కేసు నమోదు - Case registered against Narsaraopet Municipal Commissioner ramchandra reddy
నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు నుంచి మెమో జారీ కావటంతో రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ramachandra reddy