బాపట్ల మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్‌పై.. కేసు నమోదైంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నాడంటూ.. భానుప్రతాప్‌పై ఆయన భార్య శ్రీవిద్య నెల్లూరు జిల్లా కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు కావలి సీఐ శ్రీనివాసరావు తెలిపారు. తనపై సతీమణి శ్రీవిద్య చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని భానుప్రతాప్ స్పష్టం చేశారు.
బాపట్ల మున్సిపల్ కమిషనర్‌పై.. అదనపు కట్నం వేధింపుల కేసు - గుంటూరు జిల్లా వార్తలు
బాపట్ల మున్సిపల్ కమిషనర్ అన్నాప్రగడ భానుప్రతాప్‌పై.. ఆయన సతీమణి శ్రీ విద్య... కావలి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని పిర్యాదులో పేర్కొన్నారు. ఆరోపణలపై స్పందించిన భానుప్రతాప్... శ్రీవిద్య చేసిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదన్నారు.
![బాపట్ల మున్సిపల్ కమిషనర్‌పై.. అదనపు కట్నం వేధింపుల కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాసరావు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10479938-735-10479938-1612325675720.jpg)
వివరాలు వెల్లడిస్తున్న సీఐ శ్రీనివాసరావు
బాపట్ల మున్సిపల్ కమిషనర్‌పై కేసు పెట్టిన భార్య