తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులో హత్యకు గురైన బి.టెక్ విద్యార్థిని రమ్య మృతదేహానికి నివాళులు అర్పించేందుకు లోకేశ్ వెళ్లారు. ఇదే సమయంలో వైకాపా నేతలు కూడా అక్కడకు రావటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తెదేపా నేతల్ని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించి ఏడు గంటలకు పైగా ఉంచారు. అనంతరం బెయిల్ పై విడిచిపెట్టారు.
నారా లోకేశ్‌పై పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
13:43 August 17
case filed on Nara lokesh
కొవిడ్ నిబంధనల ఉల్లంఘనతో పాటు పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే అభియోగాలతో నారా లోకేశ్‌పై పాత గుంటూరు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ 341, 353, 147రెడ్ విత్ , 149 రెడ్ విత్ , 120బి సెక్షన్లు కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పాటుగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యేలు శ్రావణ కుమార్, దూళిపాళ్ల నరేంద్రపై కొత్తపేట స్టేషన్‌లో కేసు నమోదైంది. రమ్య మృతదేహాన్ని జీజీహెచ్ నుంచి తరలించే సమయంలో అడ్డుకున్నారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం