తప్పుడు పత్రాలు సృష్టించి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద రూ.30 వేలు లబ్ధిపొందిన వ్యక్తిపై గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అతడికి సహకరించిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జయరామకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపేట రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం... ప్రకాశం జిల్లాకు చెందిన జి. లక్ష్మణస్వామి (71) మార్చి 30వ తేదీన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకొని ఏప్రిల్ 1న డిశ్ఛార్చి అయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వాటి ద్వారా తన ఖాతాకు నిధులు జమ చేయించుకున్నారు. ఈ విషయమై అక్కడి ఆరోగ్యమిత్ర రాజశేఖర్, జిల్లా కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్ ద్వారా.. గుంటూరు జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ జయరామకృష్ణకు సమాచారం వచ్చింది.
ఇదీ చదవండి:కరోనా మరణాలను ప్రభుత్వాలు దాస్తున్నాయా?