కరోనా వైరస్ దెబ్బ... గుంటూరు మిర్చి ధరలపైనా పడింది. మార్కెట్‌కు వచ్చే మిర్చి ఎక్కువగా చైనా, థాయ్‌లాండ్ వంటి దేశాలకు ఎగుమతవుతుంది. అయితే ప్రస్తుతం చైనాలో విదేశీ వాణిజ్య కార్యకలాపాలు, ఎగుమతులు, దిగుమతులు నిలిపివేశారు. మిర్చి ధర మొన్నటి వరకూ క్వింటాల్‌కు 15 నుంచి 20 వేల రూపాయల వరకూ ఉండగా... ఒక్కసారిగా 15వేల లోపు పడిపోయింది. ఘాటైన గుంటూరు మిర్చికి చైనాలో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం అక్కడ వ్యాపార లావాదేవీలకు విరామం ఇవ్వటంతో ఇక్కడ నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి.
గుంటూరు మిర్చిపై కరోనా వైరస్ దెబ్బ - గుంటూరు మిర్చి ధరలపై కరోనా వైరస్ ఎఫెక్ట్ న్యూస్
కరోనా వైరస్ దెబ్బ... గుంటూరు మిర్చి ధరలపైనా పడింది. చైనాలో విదేశీ వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేయడంతో మిర్చి రేటు పడిపోయింది.
carona-virus-effect-on-gunturu-mirchi-rate
Last Updated : Feb 2, 2020, 3:48 PM IST