గుంటూరు వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌కు కరోనా లక్షణాలు కనిపించటంతో తోటి ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. కమిషనరేట్‌లోని ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసే ఉద్యోగి కుటుంబ సభ్యులకు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే సదజరు ఉద్యోగి హోం క్వారంటైన్లో ఉండకుండా కార్యాలయానికి వచ్చారు. సదరు ఉద్యోగి కూడా జ్వరంతో బాధ పడుతున్నట్లు గుర్తించారు.
విషయం తెలుసుకున్న అధికారులు అతనితో పాటు ఉద్యోగులందరినీ ఇంటికి పంపించారు. కార్యాలయం మొత్తాన్ని సోడియం హైపో క్లోరైడ్‌తో శుద్ధి చేయించారు. ఇదే ప్రాంగణంలో ఉద్యానశాఖ, మార్కెటింగ్ శాఖ, రైతుబజార్ల సీఈవో కార్యాలయాలు కూడా ఉన్నాయి. అన్ని చోట్లా నగరపాలక సంస్థ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఉద్యోగికి కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆ నివేదికను బట్టి కార్యాలయం తెరవాలా వద్దా అనేది నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు.