ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్తారింటికి వచ్చాడు.. కరోనాకు చిక్కాడు - పిడుగురాళ్లలో అత్తరింటికి వచ్చిన వ్యక్తికి కరోనా

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అత్తారింటికి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్​ వచ్చింది. భాధితుడిని మంగళగరి ఎన్​ఆర్​ఐ ఆసుపత్రికి తరలించారు. 21మందిని అతను కలిసినట్లు గుర్తించి వారిని పట్టణంలోని క్వారంటైన్‌ కేంద్రానికి పంపారు.

corona case at piduguralla
పిడుగురాళ్లలో అత్తరింటికి వచ్చిన వ్యక్తికి కరోనా

By

Published : Apr 29, 2020, 8:56 AM IST

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో తొలిసారిగా కరోనా కేసు ఒకటి వెలుగు చూసింది. ఈ నెల 7న దాచేపల్లి నుంచి పట్టణంలోని అత్తారింటికి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ తేలడంతో అధికారులు అతడిని మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రికి తరలించారు. బాధితుడు గత 20రోజులుగా ఇక్కడే ఉండడంతో ప్రాథమికంగా 21మందిని అతను కలిసినట్లు గుర్తించి వారిని పట్టణంలోని క్వారంటైన్‌ కేంద్రానికి పంపారు. అక్కడ వీరి నమూనాలు సేకరించారు. వీరిలో 17మంది రైల్వేస్టేషన్‌రోడ్డుకు సంబంధించిన వ్యక్తులు కాగా, మరో నలుగురు కళ్లం టౌన్‌షిప్‌లో నివసించే వారిగా గుర్తించారు. అయితే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కూడా చికిత్స చేయించుకున్నట్లు సమాచారం.


రెడ్‌జోన్‌గా రైల్వేస్టేషన్‌ రోడ్డు

కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి అత్తారిల్లు రైల్వేస్టేషన్‌రోడ్డులో ఉండడంతో ఆ ప్రాంతాన్ని అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. రోడ్డుకు రెండువైపులా ఇనుప కంచె వేశారు. ఆ ప్రాంతంలో నివసించే వారిని బయటకు రాకుండా ఏర్పాట్లు చేశారు. రైల్వేస్టేషన్‌ రోడ్డు ప్రాంతాన్ని మంగళవారం సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, సీఐ రత్తయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.వెంకటేశ్వర్లు, ఎస్సై సుధీర్‌కుమార్‌ పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ రెడ్‌జోన్‌ ప్రాంతంలోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, నిత్యావసరాలు వాలంటీర్లు ఇళ్లకు వచ్చి ఇస్తారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి...తస్మాత్​ జాగ్రత్త.. మురుగునీటి పైపులు ద్వారా కరోనా

ABOUT THE AUTHOR

...view details