స్టువర్టుపురంలో పోలీసుల 'కట్టడి ముట్టడి' కార్యక్రమం గుంటూరు జిల్లా స్టువర్టుపురంలో పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ చేశారు.తెల్లవారుఝామున జిల్లా రూరల్ ఏఎస్పీ మూర్తి , ఎక్సైజ్ శాఖ డీఎస్పీ ఆదిశేషు ఆధ్వర్యంలో 74 మంది సిబ్బంది.. 14 బృందాలుగా విడిపోయి పోలీసు స్టేషన్ పరిధిలో విస్తృతంగాగాలించారు. అక్రమంగా నిల్వ చేసిన 30 లీటర్ల నాటుసారా, 1400 లీటర్ల బెల్లం ఊట స్వాధీనం చేసుకొన్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. మద్య రహిత ఎన్నికలు నిర్వహించడమే ధ్యేయంగా దాడులు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి