ఆగి ఉన్న కారును మరో కారు వచ్చి ఢీకొట్టిన ఘటన గుంటూరు జిల్లా సత్యనారాయణపురం గ్రామం వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో కొచ్చెర్లకు చెందిన శ్రీ లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. టైరు పంచర్ కావడం వల్ల వేగంగా వచ్చి ఆగి ఉన్న కారును ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈపూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించి… ప్రాణహాని జరగలేదని నిర్ధారించుకున్నారు. క్షతగాత్రులను గుంటూరు ఆసుపత్రికి తరలించామని ఎస్సై సింగయ్య తెలిపారు.
ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మరో కారు… మహిళకు తీవ్ర గాయాలు - satyanarayanapuram village near road accident latest news
వేగంగా వస్తున్న కారు టైరు పంచర్ కావడం వల్ల అదుపుతప్పి ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటన సత్యనారాయణపురం వద్ద జరిగింది. ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కారు టైరు పంచర్ కావడమే కారణంf
TAGGED:
గుంటూరు జిల్లా తాజా వార్తలు