ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. ఆ తర్వాత ఏమైంది? - రేవేంద్రపాడు
ఓ కారు అతి వేగం.. ఓ ఇంటిని కూల్చినంత పని చేసింది. అదుపుతప్పి.. రోడ్డు దాటి.. పక్కనున్న ఇంట్లోకి దూసుకెళ్లి బోల్తా పడిన ఆ కారు.. భీభత్సాన్ని మిగిల్చింది.
car bolta
గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు సమీపంలోని ఓ ఇంట్లోకి.. కారు దూసుకెళ్లింది. మితిమీరిన వేగంతో అదుపు తప్పిన కారు.. ఇంట్లోకి వెళ్లి బోల్తా పడింది. ఆ సమయానికి.. ప్రమాద స్థలంలో ఎవరూ లేకపోవడం.. ప్రమాదాన్ని తప్పించింది. వేగంగా వచ్చిన కారు ధాటికి ఇల్లు చెల్లాచెదురైంది.