గుంటూరు జిల్లా తెనాలిలో కారులో మంటలు చెలరేగాయి. తెనాలి నుంచి విజయవాడ వెళ్తున్న కారులో శుక్రవారం తెల్లవారుజామున ఇంజిన్ నుంచి మంటలు వచ్చాయి. డ్రైవర్ అప్రమత్తమై వాహనం నిలిపివేశాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోగానే కారు పూర్తిగా దగ్ధమైంది. రూ. 10 లక్షల మేర నష్టం జరిగింది. గడచిన నాలుగు రోజుల్లో.. తెనాలి ప్రాంతంలోనే మూడు కార్లు ఇలా కాలిపోయాయి. సంగంజాగర్లమూడి, చెంచుపేట ప్రాంతాల్లో ఇదే తరహాలో కార్లలో మంటలు చెలరేగాయి.
కారులో చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధం - tenali road accidnets latest news
గుంటూరు జిల్లా తెనాలిలో కారులో మంటలు చెలరేగాయి. వాహనం పూర్తిగా దగ్ధమైంది. తెనాలి నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన జరిగింది.
కారులో చెలరేగిన మంటలు