ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంబులెన్స్, కారు ఢీ... ఓ వ్యక్తి మృతి.. ఇద్దరికి గాయాలు - guntur road accident news

అంబులెన్స్, కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది.

ambulance car accident
ambulance car accident

By

Published : May 29, 2021, 8:10 PM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్స్ , కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈపూరికి చెందిన పూర్ణ చంద్రరావు గతంలో సైనికుడిగా విధులు నిర్వర్తించారు. ఆయనకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్​ నిర్ధారణ అయింది.

ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. మృతదేహాన్ని ఇవాళ ఈపూరుకు తీసుకొస్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు, అంబులెన్స్ పరస్పరం ఢీకొన్నాయి. కోటేశ్వరరావు అనే వ్యక్తి మృతి చెందగా.. కారులో వస్తున్న వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఫిరంగీపురం పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details