అమరావతి సీడ్ యాక్సిస్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగింది. రహదారి పక్కన ఉన్న కాలువలోకి కారు దూసుకెళ్లి విజయవాడకు చెందిన మానం శివకుమార్ అనే వ్యక్తి మృతి చెందారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్ధండరాయుని పాలెంలో తన అత్త అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మందడం వద్ద ఉన్న మలుపును గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు...వ్యక్తి మృతి ! - అమరావతిలో కారు ప్రమాదం
కాలువలోకి కారు దూసుకెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అమరావతి సీడ్ యాక్సిస్ రహదారిపై జరిగింది. మృతుడు విజయవాడకు చెందిన మాసం శివకుమార్‌గా గుర్తించారు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు...వ్యక్తి మృతి !