ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బంధువుల ఇంటి నుంచి తిరిగిరాని లోకాలకు..! - మోర్తోట వద్ద కారు యాక్సిడెంట్

గుంటూరు జిల్లా మోర్తోట వద్ద పంట కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు.

car accident at morthota guntur district
మోర్తోట వద్ద కారు ప్రమాదం

By

Published : Jan 16, 2020, 12:59 PM IST

మోర్తోట వద్ద కారు ప్రమాదం

గుంటూరు జిల్లా రేపల్లె మండలం మోర్తోట వద్ద కారు ప్రమాదానికి గురైంది. పంట కాలువలోకి కారు దూసుకుపోయిన ఘటనలో శ్రీనివాస్ అనే వ్యక్తి మరణించాడు. విజయవాడలో ఉంటున్న శ్రీనివాస్... పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి పిరాట్లంకలో ఉన్న అత్త వారింటికి వచ్చారు. బుధవారం బంధువులను కలిసి, తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పింది. మోర్తోట సమీపంలో కాలువలో పడిపోయింది. తెల్లవారుఝామున స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details