మూడు పంటలు పండే భూముల్ని రైతులు రాజధానికి ఇచ్చేయడంతో... రైతు కూలీలు, నిరుపేదల ఉపాధి సమస్యకు పరిష్కారంగా గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి నెలా 2,500 పింఛన్ ఇచ్చింది. 29 గ్రామాల్లో సుమారు 19 వేల మంది పింఛన్ లబ్ధిదారులున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరికి పింఛన్ కష్టాలు మెుదలయ్యాయి. ప్రతినెల ఠంఛనుగా పింఛన్ ఇవ్వడం లేదంటున్న లబ్ధిదారులు... మే నుంచి అక్టోబర్ వరకూ పింఛన్ ఆపేశారని వాపోతున్నారు. ఇంత ఆలస్యం చేసినా అరకొరగానే పంపిణీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెక్కాడితే కానీ డొక్కాడని ఈ ప్రాంత వాసులు ఆర్ధికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూలీకి పోదామంటే వ్యవసాయం లేదు. పనులకు పోదామంటే అమరావతి ప్రాంతంలో 3ఏళ్లుగా నిర్మాణాలు నిలిచిపోయాయి. పింఛన్ డబ్బులు సకాలంలో రాకపోవడంతో కుటుంబం గడవడం కూడా కష్టమైందని వాపోతున్నారు. సామాజిక భద్రతా పింఛన్ల మాదిరే ప్రతినెల అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
అక్టోబర్ నెల వరకూ అయిదు నెలల పింఛన్‌ను అధికారులు పెండింగ్ లో పెట్టారు. జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించి 14 కోట్లు నిధుల్ని గత నెలలో విడుదల చేశారు. మరో రెండు నెలల పింఛన్ 9కోట్ల రూపాయలు ఇంకా విడుదల కావాల్సి ఉంది.
రాజధాని ప్రాంత పేదలకు తప్పని పింఛన్ కష్టాలు.. నెలలు తరబడి ఆపేయడంతో తీవ్ర ఇబ్బందులు - రైతుల భూములు
సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న వైకాపా సర్కారు.... రాజధాని అమరావతి ప్రాంతంలో భూమి లేని నిరుపేదలపైనా అక్కసు వెల్లగక్కుతోంది. పింఛన్ సకాలంలో ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని రాజధాని ప్రాంత వాసులు వాపోతున్నారు.
రాజధాని ప్రాంత పేదలకు తప్పని పింఛన్ కష్టాలు