అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం 341వ రోజూ కొనసాగింది. తుళ్లూరు, వెలగపూడి, మందడం, నెక్కల్లు, పెదపరిమి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, అనంతవరం, వెంకటపాలెం, కృష్ణాయపాలెంలో రైతులు ఆందోళనలు కొనసాగించారు. నెక్కల్లు, అనంతవరం, పెద్దపరిమి గ్రామాల్లో రైతుల దీక్షకు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మద్దతు తెలిపారు. వైకాపా చేస్తున్న అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని పుల్లారావు డిమాండ్ చేశారు. మరో ఏడాది కంటే ఎక్కువ కాలం జగన్ పరిపాలన చేయలేరని పుల్లారావు వ్యాఖ్యానించారు.
341వ రోజూ కొనసాగిన రాజధాని రైతుల ఉద్యమం - capital formers protest in mandadam
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం 341వ రోజూ కొనసాగింది. పెదపరిమిలో రైతుల దీక్షకు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీశాసనసభ్యులు శ్రావణ్ కుమార్ మద్ధతు పలికారు.
341 వ రోజూ ఉధృతంగా కొనసాగిన రాజధాని రైతుల ఉద్యమం