ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో పీఎస్ ఎదుట అమరావతి రైతుల ఆందోళన - కొల్లిపర పోలీస్ స్టేషన్​కి అమరావతి రైతులు

గుంటూరు జిల్లా కొల్లిపర పోలీస్ స్టేషన్ ముందు అమరావతి రైతులు ఆందోళన నిర్వహించారు. అమరావతి ప్రాంతంలో జాతీయ మహిళా కమిషన్ విచారణ నేపథ్యంలో 30 మంది రైతులను పీఎస్​కు తరలించారని ఆక్షేపిస్తూ నిరసన చేపట్టారు.

capital formers in guntur kollipara  police
కొల్లిపర పీఎస్ ముందు రైతుల ఆందోళన

By

Published : Jan 11, 2020, 7:44 PM IST

కొల్లిపర పీఎస్ ముందు రైతుల ఆందోళన

గుంటూరు జిల్లా కొల్లిపర పోలీస్ స్టేషన్ ఎదుట అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేశారు. రాజధాని ప్రాంతాల్లో... జాతీయ మహిళా కమిషన్ విచారణ నేపథ్యంలో 30 మంది రైతులను పోలీసులు బలవంతంగా పీఎస్​లో ఉంచినట్లు మిగిలిన వారు చెబుతున్నారు. రాజధాని, రాష్ట్రాభివృద్ధి కోసం భూములు త్యాగం చేసిన రైతులను బలవంతంగా తీసుకు వచ్చి నేరస్థుల్లాగా లోపల ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details