ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, తితిదే భూములను పరిరక్షించాలని కోరుతూ అమరావతిలో రైతులు, మహిళలు ఒకరోజు నిరసన దీక్షకు దిగారు. తుళ్లూరు మండలం వెంకటాయపాలెం, మందడం, దొండపాడు, తుళ్లూరు, వెలగపూడి కృష్ణాయపాలెంలో రైతులు, మహిళలు శ్రీవారి చిత్ర పటంతో దీక్షకు దిగారు.
శ్రీవారి చిత్రపటంతో అమరావతి రైతుల దీక్ష - శ్రీవారి చిత్రపటంతో అమరావతి రైతుల దీక్ష
అమరావతినే రాజధానిగా కొనసాగించటం తోపాటు తితిదే భూములను రక్షించాలని కోరుతూ...రాజధాని రైతులు నిరసన దీక్షకు దిగారు. భక్తుల మనోభావాలతో వైకాపా సర్కారు ఆడుకుంటుందని విమర్శించారు.
శ్రీవారి చిత్రపటంతో అమరావతి రైతుల దీక్ష
తన భూములను శ్రీవారు ఎలా రక్షించుకున్నారో.....అమరావతినే అలాగే కాపాడాలని రైతులు ప్రార్థించారు. ఆలయ భూములు విక్రయించకుండా కేంద్రమే ప్రత్యేక జీవో విడుదల చేయాలని మహిళా రైతులు విజ్ఞప్తి చేశారు. భక్తుల మనోభావాలతో వైకాపా సర్కారు ఆడుకుంటుందని విమర్శించారు.