పాలకుల కంటే తమకు కోర్టులపైనే విశ్వాసముందని రాజధాని ప్రాంత రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైకోర్టులో సీఆర్డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలపై దాఖలు చేసిన పిటిషన్ల విచారణ ఉండటంతో రాజదాని ప్రాంతంలోని రైతులు న్యాయదేవతకు పాలాభిషేకం చేశారు. వెలగపూడి, మందడం, తుళ్లూరు తదితర ప్రాంతాల్లో రైతులు న్యాయదేవతకు పాలాభిషేకంతో పాటు పూలు అర్చించారు. ముఖ్యమంత్రి అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై సమీక్ష నిర్వహించినా దానితో తమకు సంబంధం లేదని.. సీఆర్డీఏతోనే తాము ఒప్పందం చేసుకున్నామని స్పష్టం చేశారు.
న్యాయదేవతకు రాజధాని రైతుల పాలాభిషేకం - capital famres taja news
న్యాయదేవతకు అమరావతి రైతులు పాలాభిషేకం చేశారు. పాలకుల కంటే తమకు న్యాయదేవతపైనే నమ్మకం ఉందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కోర్టులే తమకు న్యాయం చేస్తాయని తెలిపారు.
capital farmers prayers to law of justice in thuluru