రాజధాని రైతులు ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యారు. అమరావతిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రకటనపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలో... 29 గ్రామాల రైతులు సమావేశమయ్యారు. రాజధాని గురించి ఇప్పటివరకు మంత్రులు చేసిన ప్రకటనపై తాము ఎలాంటి ఆందోళన చెందలేదని... కానీ ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలతో ఆందోళనకు గురయ్యామని తెలిపారు. వచ్చేనెల 9లోపు ముఖ్యమంత్రి జగన్ అమరావతిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 9 నుంచి సచివాలయం వద్ద నిరాహారదీక్షకు దిగుతామని తేల్చిచెప్పారు.
'సీఎం స్పందించకపోతే... నిరాహార దీక్ష చేస్తాం'
రాజధాని అమరావతిపై స్పష్టత ఇవ్వాలని ఆ ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమావేశమైన రాజధాని రైతులు