'రాజధాని కోసం అరెస్ట్ అవ్వటానికైనా సిద్దం' - రాజధానిపై ఎంపీ గల్ల జయదేవ్ వ్యాఖ్యలు
రాజధాని కోసం అరెస్ట్ అవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు అనుమతి లేదని అరెస్టు చేసి.. అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
రాజధాని కోసం అరెస్ట్ అవ్వడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే అనుమతి లేదని అరెస్టు చేసి.. అక్రమ కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. నిన్న గుంటూరు జిల్లాలో యువజన సంఘాల నాయకులు ధర్నా చేస్తుండగా అనుమతి లేదని అరెస్ట్ చేసి పాత గుంటూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎంపీ జయదేవ్ పోలీసు స్టేషన్కు చేరుకుని నాయకులను విడిపించారు. ప్రభుత్వం... అమరావతి ఉద్యమాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా చేయాలని ప్రయత్నిస్తుందని, ఇలా చేస్తే ఉద్యమం మరింత ఉద్ధృతంగా మారుతుందని హెచ్చరించారు. నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్య దేశంలో ప్రాథమిక హక్కు అని దాన్ని కాలరాయడం సబబు కాదని సూచించారు.