ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏడాదికి పైగా ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోదా?' - amaravathi farmers agitation update

అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని.. అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు 413వ రోజూ కొనసాగాయి. పోలీసుల సాయంతో తమ పోరాటాన్ని అణచివేయాలని చూస్తున్నారని రైతులు ఆరోపించారు.

amaravathi agitation
అమరావతి ఉద్యమం

By

Published : Feb 3, 2021, 9:07 AM IST

అమరావతి రైతుల పోరాటం 413వ రోజు కొనసాగింది. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు, దీక్షలు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, పెదపరిమి, వెలగపూడి, మందడం దీక్షా శిబిరాల వద్దకు రైతులు, మహిళలు భారీగా తరలివచ్చారు. ఏడాదికి పైగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నదాతుల ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాజధాని రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని వాపోయారు. పోలీసుల సాయంతో తమ పోరాటాన్ని అణిచివేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లోనూ దౌర్జన్యాలతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details