ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని ఉండాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. గన్నవరం ప్రధాన కూడలి నుంచి వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ.. సీఎం జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిని మార్చడం ద్వారా అభివృద్ధి కుంటుపడుతుందని, ఇప్పటికే ఐటీీ సంస్థలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి కోసం కొవ్వొత్తులతో ప్రదర్శన - అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో కొవ్వుత్తుల ప్రదర్శన వార్తలు
అమరావతి పరిరక్షణ సమితి, ఐకాస ఆధ్వర్యంలో గన్నవరం ప్రధాన కూడలి నుంచి ఎన్టీఆర్ కూడలి మీదుగా వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. 'ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో కొవ్వుత్తుల ప్రదర్శన