ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నందం సుబ్బయ్య మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలి' - guntur district protest

గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నేతలు కాగడాలు, కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన నందం సుబ్బయ్య మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు.

candle rally in mangalagiri guntur district
గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నేతలు కాగడాలు, కొవ్వొత్తుల ర్యాలీ

By

Published : Jan 2, 2021, 9:43 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన నందం సుబ్బయ్య మృతిపై సీబీఐతో విచారణ చేయించాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. సుబ్బయ్య హత్యను నిరసిస్తూ... గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నేతలు కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి పాతబస్టాండ్ మీదుగా అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. సుబ్బయ్య హత్యతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న ప్రొద్దుటూరు వైకాపా శాసనసభ్యులు, ఆయన అనుచరులపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలు, దళితులపై దాడులు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details