అభ్యర్థుల తరఫున కుటుంబసబ్యలు ప్రచారం గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ రోడ్ షో చేశారు. ఆయన సోదరి కమల.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తన సోదరుడు చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ.. కరపత్రాలు పంచారు. నియోజకవర్గంలో సీసీ రోడ్లు, తాగు నీరు, డ్రైనేజీ సమస్యలు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారనీ.. తెదేపాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరోవైపు వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోపిదేవి రమణారావు తరఫున ఆయన సతీమణి అరుణ ప్రచారం చేశారు.
ఇవీ చదవండి..