ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికల నాలుగో విడతకు జోరుగా అభ్యర్ధుల ప్రచారం - fourth phase local elections at prattipadu gunturu district news update

నాలుగో విడత ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈరోజుతో ప్రచారం ముగియనుంది. ప్రచారానికి పెద్దగా సమయం లేకపోవటంతో.. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో అభ్యర్ధులు తనకు కేటాయించిన గుర్తులను వాహనాలకు తగిలించి వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.

campaign on fourth phase local elections
జోరుగా అభ్యర్ధుల ప్రచారం

By

Published : Feb 19, 2021, 4:17 PM IST

నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు 21న జరగనున్న నేపథ్యంలో.. ఈ రోజుతో ప్రచారాలు ముగియనున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. అయితే ప్రచారాలకు సమయం లేకపోవటంతో.. ఓటర్లు ఎక్కువుగా ఉన్న మేజర్ పంచాయతీల్లో పోటీలో నిలిచిన అభ్యర్థులు.. తమకు కేటాయించిన గుర్తులను వాహనాలకు అమర్చి ప్రచారం చేస్తున్నారు.

ప్రత్తిపాడు సర్పంచి అభ్యర్థిగా ఈగ శివపార్వతి పోటీలో వున్నారు. ఆమెకు మంచం గుర్తును అధికారులు కేటాయించారు. ప్రత్యేకంగా తయారుచేసిన మంచాన్ని కారుపై ఉంచి.. గ్రామ వీధుల్లో ప్రచారం చేస్తూ.. ఓటర్ల దృష్టిని ఆకట్టుకుంటున్నారు. పెదనందిపాడులో సర్పంచి అభ్యర్థులు సుధాకర్, పద్మారావులు సైతం తమ గుర్తులతో ఫ్లెక్సీలు తయారు చేపించి ఆటోలకు అమర్చి, మైకులు పెట్టి ప్రచారాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే స్థాయిలో ప్రచారాలకు వాహనాలు వాడుతూ.. ఓటర్లకు గాలం వేయటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details