గుంటూరు జిల్లా పెదకాకానిలోని అమెరికన్ ఆంకాలజీ ఆస్పత్రి వైద్యులు క్లిష్టమైన క్యాన్సర్ శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఓ మహిళ పొట్ట భాగంలో ఏర్పడిన 10.2 కిలోల క్యాన్సర్ కణితిని తొలగించారు. సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ పణీంద్ర కుమార్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. చీరాలకు చెందిన సరస్వతి అనే మహిళ ఎడమ అండాశయంలో ఏర్పడిన గడ్డ అసాధారణంగా పెరిగింది.
ఉదరభాగం, ఊపిరితిత్తుల్లోనూ నీరు చేరి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారగా.. అక్కడి వైద్యులను ఆశ్రయించారు. వైద్య పరిభాషలో మీగ్స్ సిండ్రోమ్ కారణంగా క్యాన్సర్ కణితి ఏర్పడిందని గుర్తించిన వైద్యులు.. హిస్టరెక్టమీ ఆపరేషన్ నిర్వహించారు. అండాశయంలో ఏర్పడిన భారీ కణితిని తొలగించారు. క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి తనను కాపాడిన వైద్యబృందానికి చీరాలకు చెందిన సరస్వతి అనే మహిళ కృతజ్ఞతలు తెలిపారు.