గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో అధికంగా కరోనా కేసులు నమోదవుతున్నందున.. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి వేడుకలను రద్దు చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రభాకర్ రావు తెలిపారు.
ఇంట్లోనే పూజలు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాలలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.