ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆర్టీసీ కార్గో సేవలపై వినూత్న రీతిలో ప్రచారం

By

Published : Nov 25, 2020, 7:16 PM IST

గుంటూరుకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి కార్గో సేవలపై వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. పాతకాలపు పద్ధతిలో చిన్న మైకు చేతబట్టి ప్రధాన కూడళ్లలోని దుకాణాలు, వ్యాపార సంస్థల వద్ద ప్రచారం నిర్వహిస్తున్నాడు.

ఆర్టీసీ కార్గో సేవలపై వినూత్న రీతిలో ప్రచారం
ఆర్టీసీ కార్గో సేవలపై వినూత్న రీతిలో ప్రచారం

ఏపీఎస్‌ఆర్టీసీ సరుకు రవాణా కార్గో సేవలపై వినూత్న రీతిలో ప్రచారం చేపడుతోంది. ఆర్టీసీకి చెందిన ఉద్యోగి రామాంజనేయులు వినూత్నంగా చిన్న మైకు చేతబట్టి ప్రధాన కూడళ్లలోని దుకాణాలు, వ్యాపార సంస్థల వద్ద ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఆర్టీసీ సరుకు రవాణా సేవలను గురించి మైకు ద్వారా తెలుపుతూ గుంటూరు నగరమంతటా ప్రచారం చేస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు కార్గో సేవల వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details